Friday, February 13, 2026
Homeకెరీర్ న్యూస్Multi Tasking Staff | పదో తరగతి అర్హతతో IBలో 362 పోస్టులు

Multi Tasking Staff | పదో తరగతి అర్హతతో IBలో 362 పోస్టులు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home ministry) పరిధిలోని ఇంటలిజెన్స్ బ్యూరో(intelligence bureau)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) (Multi tasking staff) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (Direct recuitment) కోసం ప్రకటన విడుదలైంది. 37 నగరాల వారీగా ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో 6, విజయవాడలో 3 వేకెన్సీ ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా చూస్తూ అన్ రిజర్వ్‌డ్ 160, ఓబీసీ ఎన్‌సీఎల్ 72, ఎస్సీ 42, ఎస్టీ 54, ఈడబ్ల్యూఎస్ 34 ఖాళీలు భర్తీ చేస్తారు.

ఎంపికైనవారికి రూ.18 వేల నుంచి రూ.56,900 వరకు ఇస్తారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ భత్యాలు అదనం. బేసిక్ పేలో 20 శాతం స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ సైతం పొందొచ్చు. సెలవుల రోజు పనిచేస్తే నగదు రూపంలో వేతనం చెల్లిస్తారు.

- Advertisement -

పదో తరగతి లేదా తత్సమాన విద్యాభ్యాసం (Tenth Class Qualification) ఉన్నవాళ్లు వచ్చే నెల 14లోపు ఆన్‌లైన్‌(www.mha.gov.in లేదా www.ncs.gov.in)లో అప్లై చేసుకోవాలి. 2025 డిసెంబర్ 14 నాటికి పాతికేళ్లలోపు వయసువాళ్లు అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో రెండు మూడు దశలు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News