Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Nori Dattatreyudu | సీఎం రేవంత్‌కు అభినందనలు

Nori Dattatreyudu | సీఎం రేవంత్‌కు అభినందనలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025(Telangana Rising Global Summit-2025)ను విజయవంతంగా నిర్వహించడంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ప్రభుత్వ సలహాదారు(Government Advisor), ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు (Renowned Cancer Specialist) డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభినందనలు (Congratulatory Wishes) తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ చారిత్రాత్మక విజయమని సీఎంకి రాసిన లేఖలో పేర్కొన్నారు. డీప్‌టెక్, గ్రీన్‌ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రావడం తెలంగాణ రైజింగ్-2047(Telangana Rising-2047) విజన్‌కు అద్దం పడుతోందని చెప్పారు. ల‌క్ష‌ల కోట్ల రూపాయల పెట్టుబ‌డులు రావ‌డం సీఎం పాల‌న‌, స్థిర‌త్వం, భ‌విష్య‌త్తుపైన ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

ప్రపంచ వేదికపై తెలంగాణ పోటీ పడటానికి విజన్-2047 ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు కోసం చేస్తున్న ప్రయత్నాలు హర్షనీయమని తెలిపారు. ప్రజారోగ్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెట్టుబడులు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. క్యాన్స‌ర్ చికిత్స‌లో తెలంగాణ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా నిల‌బ‌డే అవ‌కాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్ర‌పంచ దిగ్గ‌జాల‌ను హైద‌రాబాద్, ఫ్యూచర్ సిటీకి ర‌ప్పించి తెలంగాణ‌ భార‌తదేశ స్టార్ట‌ప్‌గా, మాన‌వ వనరుల అభివృద్దికి ప్ర‌పంచ కేంద్రంగా మారుతుంద‌ని రేవంత్ రెడ్డి రుజువు చేశారని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News