మెట్రో శిరీష్, శ్రియ శరణ్ (Sriya Sharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాన్-వయోలెన్స్’(Non-Violence). ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే పిక్చర్స్ (Ak Pictures) నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) కంపోజ్ చేసిన కనకం సాంగ్‌ని రిలీజ్ (Song Release) చేశారు. అదిరిపోయే ఫుట్ ట్యాపింగ్ నంబర్‌గా ట్యూన్ చేసిన ఈ సాంగ్‌లో యువన్ శంకర్ రాజా, తేజస్విని నందిభట్ల వోకల్స్ కట్టిపడేశాయి.
భాష్యశ్రీ అర్థవంతమైన సాహిత్యంతో అలరించారు. మెట్రో శిరీష్, శ్రియ శరణ్ ఎనర్జిటిక్ మూవ్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహా, యోగి బాబు, అదితి బాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎన్.ఎస్.ఉతయకుమార్, ఎడిటర్ శ్రీకాంత్. నటీనటులు.. మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు, అదితి బాలన్. రచన & దర్శకత్వం ఆనంద కృష్ణన్, నిర్మాత Ak Picture, సంగీతం యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రాఫర్ ఎన్.ఎస్.ఉతయకుమార్, ఎడిటర్ శ్రీకాంత్ Nb, పీఆర్వో వంశీ శేఖర్.
