Monday, January 19, 2026
EPAPER
Homeహైదరాబాద్‌Secunderabad | సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కోసం నోముల ప్రకాష్ పోరాటం

Secunderabad | సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కోసం నోముల ప్రకాష్ పోరాటం

  • శాంతియుత ర్యాలీని అడ్డుకుని చిలకలగూడ స్టేషన్‌కు తరలింపు

సికింద్రాబాద్‌కు ప్రత్యేక కార్పొరేషన్ & జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ,సీతాఫలమండి చౌరస్తాలో శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,నామాల గుండు కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నోముల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.నోముల ప్రకాష్ నేతృత్వంలో అనుచరులతో కలిసి సాగుతున్న ర్యాలీని చిలకలగూడ పోలీసులు అడ్డుకుని,పాల్గొన్న నాయకులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నోముల ప్రకాష్ మాట్లాడుతూ,సికింద్రాబాద్‌కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.అదేవిధంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్,సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం.అదే పోరాట స్ఫూర్తితో సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాను కూడా సాధిస్తమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ,ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ నగరాన్ని ఎవరూ పేరు మార్చలేరన్నారు.

- Advertisement -

సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలనేది ప్రజల కోరిక.అది తప్పకుండా ఏర్పాటై తీరాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.ఈ లక్ష్యం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని,సికింద్రాబాద్ ప్రజల ఆశయాల కోసం తమ త్యాగాలు,ఉద్యమాలు కొనసాగుతాయని నోముల ప్రకాష్ స్పష్టం చేశారు.ఈ శాంతియుత నిరసన ర్యాలీలో రవి మహదేవన్,సురేష్ గౌడ్,శ్రీశైలం యాదవ్,వెంకట్ సాయి కుమార్,బాలు,జీవన్,ప్రశాంత్,జ్ఞానేశ్వర్, శ్రవణ్ కుమార్,శ్రీనివాస్,గణేష్ తదితరులను పోలీసులు స్టేషన్‌లో నిర్బంధించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News