Friday, October 10, 2025
ePaper
Homeఅంతర్జాతీయంNobel| మరియా కొరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి

Nobel| మరియా కొరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి

నోబెల్ శాంతి బహుమతిపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు వెనెజులా పార్లమెంట్ సభ్యురాలైన మరియా కొరినా మచాడో (Maria Corina Machado)ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. వెనిజులాలో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతియుత పరివర్తన కోసం, ప్రజల హక్కుల కోసం మరియా కొరినా మచాడో చేస్తున్న నిరంతర కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రస్తుతం ఆమె ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నది.

నికోలస్ మదురో రెజీమ్‌కు వ్యతిరేకంగా తన నిర్భీత పోరాటానికి, వెనిజువెలా ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు సాధించేందుకు చేసిన ఆమె పోరాటానికి నోబెల్ వరించింది. ఈ నోబెల్ శాంతి బహుమతి వెనిజువెలాలో పాలనను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు మళ్లించే క్రమంలో మరియా కొరినా మచాడో సాధించిన ఓ మైలురాయిగా చెప్పవచ్చు. వెనిజులా(Venezuela)లో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. దేశంలో పెరిగిపోతున్న నియంతృత్వ చీకట్లలో ప్రజాస్వామ్య జ్యోతిని వెలిగిస్తూ, లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్న ఆమె ధైర్యానికి, శాంతియుత పోరాటానికి ఈ బహుమతి ఒక గుర్తింపు అని నోబెల్ కమిటీ అభివర్ణించింది. 

ఇదిలావుంటే.. నోబెల్ కమిటీ ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కు తీవ్ర నిరాశ ఎదురైంది. తాను అనేక యుద్ధాలు ఆపి, ప్రపంచ శాంతి నెలకొల్పానని, నోబెల్ శాంతి పురస్కారం తనకే ఇవ్వాలని ఆయన గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పలు దేశాలు కూడా ట్రంప్ కు ఈ దిశగా మద్దతు పలికాయి. కానీ, తాజా ప్రకటనతో నోబెల్ కమిటీ ఆలోచనలు మరోలా ఉన్నాయని స్పష్టమైంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News