పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank)ను మోసం చేసిన కేసులో ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ(Mehul Choksi)ని ఇండియాకి అప్పగిస్తామని బెల్జియం న్యాయస్థానం (Belgian court) తెలిపింది. అతణ్ని భారత్(India)కు అప్పగించటంలో ఎలాంటి ఆటంకాలూ లేవని స్పష్టం చేసింది. వాస్తవానికి ఛోక్సీని ఇండియాకి అప్పగించేందుకు బెల్జియం కోర్టు ఇటీవల ఆమోదం తెలిపినా.. నిందితుడు అభ్యంతరం (Objection) వ్యక్తం చేశాడు. తన అప్పగింత రాజకీయ (Political) ప్రేరేపితమని, దీనివల్ల తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆందోళన వెలిబుచ్చాడు.
అయితే ఈ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఛోక్సీ బెల్జియం పౌరుడు (Citizen) కాదని తేల్చిచెప్పింది. అప్పగింతను సమర్థించే బలమైన అభియోగాలను అతను ఎదుర్కొంటున్నాడని పేర్కొంది. ఛోక్సీపై ఇండియా చేసిన అభియోగాలను బెల్జియం చట్టం ప్రకారం కూడా నేరాలుగానే పరిగణిస్తామని వివరించింది. ఛోక్సీ అప్పగింత తర్వాత అతణ్ని బంధించే జైలు(Jail)కు సంబంధించి ఇండియా ఇచ్చిన వివరాలను బెల్జియం కోర్టు ప్రస్తావించింది.
