Friday, April 10, 2026
Homeఆదిలాబాద్NMR Workers | కార్మికులకు పనికి తగ్గ వేతనం అందహించాలి

NMR Workers | కార్మికులకు పనికి తగ్గ వేతనం అందహించాలి

  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

జిల్లాలో పనిచేస్తున్న నామినల్ మస్టర్ రోల్ (ఎన్ఎంఆర్) కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్ లో, గురువారం, ఎన్ఎంఆర్ వేజెస్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా దినసరి కార్మికుల చేతనాల పెంపు గురించి చర్చించారు.

2024 – 25 సంవత్సరానికి గాను 15 శాతం, 2025 – 26 సంవత్సరానికి 10 శాతం, 2026 – 27 సంవత్సరానికి 5 శాతం వేతనాలు పెంచారు. కార్మికుల శ్రమకు తగిన వేతనం ఇవ్వడం ద్వారా వారిని గౌరవించినవారిమౌతామని కలెక్టర్ తెలిపారు. కార్మికులకు సంబంధిత వేతనములు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -

ఈ సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి రాజలింగు, సిపిఓ జీవరత్నం, డిఆర్డిఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈవో శంకర్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శంకర్, బిసి సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఆర్ అండ్ బి సుభాష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News