Monday, April 13, 2026
Homeఆదిలాబాద్Nirmal | ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

Nirmal | ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

  • శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా 73.43 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచిందని, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 62.93 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానాన్ని సాధించిందని పేర్కొన్నారు. విద్యార్థులు సాధించిన ఈ విజయంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. అనుత్తీర్ణులైన విద్యార్థులు నిరుత్సాహానికి లోనుకాకుండా, పట్టుదలతో మళ్లీ ప్రయత్నించి విజయాన్ని అందుకోవాలని ప్రోత్సహించారు.

- Advertisement -

విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలెక్టర్ అభినందించారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించి, జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News