Tuesday, February 10, 2026
Homeఆదిలాబాద్Nirmal Congress | టికెట్ ఎవరికిచ్చినా గెలిపిద్దాం

Nirmal Congress | టికెట్ ఎవరికిచ్చినా గెలిపిద్దాం

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల భేటీ
రానున్న మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం
ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

నిర్మల్ పట్టణ కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే(Bodhan Mla) సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy), డీసీసీ చీఫ్, ఖానాపూర్ ఎమ్మెల్యే(Khanapur Mla) వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేయాలని సూచించారు. సర్వేల ఆధారంగా అధిష్టానం(High Command) టికెట్లు (Ticket) కేటాయిస్తుందని తెలిపారు. ఎవరికి టికెట్ కేటాయించినా.. కలిసి కట్టుగా పని చేసి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ డిసీసీ అధ్యక్షుడు శ్రీహరి, లైబ్రరీ చైర్మన్ అంజుమన్ అలీ, రావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎంబడి రాజేశ్వర్, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమరసింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News