Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeబిజినెస్లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కలిసొచ్చిన‌ కాలం

నష్టాలను వీడి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలను మించి తైమ్రాసిక ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో రెండ్రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు బయటపడ్డాయి. మరోవైపు రికార్డు తైమ్రాసిక ఫలితాలను ప్రకటించినప్పటికీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,918.53 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,757.73) స్వల్ప లాభాల్లో ప్రారంభమై వెంటనే నష్టాల్లోకి జారుకుంది. కాసేపటి తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చిన సూచీ.. రోజంతా లాభాల్లోనే కొనసాగింది.

ఇంట్రాడేలో 82,274.03 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 442.61 పాయింట్ల లాభంతో 82,200.34 వద్ద స్థిరపడిరది. నిప్టీ 122.30 పాయింట్ల లాభంతో 25,090.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.30గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎటర్నల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బీఈఎల్‌ షేర్లు రాణించాయి. రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ -టె-క్నాలజీస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టీసీఎస్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 69.04 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3374 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News