రాజా సాబ్ సినిమా(Raja Saab) గురించి, హీరో ప్రభాస్(Hero Prabhas) గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఏం చెప్పారో ఆమె మాటల్లోనే.. ‘ప్రేక్షకులంతా “రాజా సాబ్”ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నా. ఈ మూవీ కోసం 3 ఏళ్లు కష్టపడ్డాం. దానికి ప్రేక్షకులు మంచి రిజల్ట్ ఇచ్చారని భావిస్తున్నాం. సినిమాకు మొదట్లో కొద్దిగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా స్ట్రాంగ్ హోల్డ్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ క్రియేట్ చేస్తోంది. నేను బెస్సీ అనే రోల్ చేశాను. ఈ నన్ రోల్‌లో డివైన్‌గా కనిపించాలి.

ఈ పాత్ర కోసం చాలా ప్రిపరేషన్స్ చేశాం. ముఖ్యంగా డ్రెస్ ఎలా ఉండాలనే విషయంలో డిస్కషన్స్ బాగా జరిగాయి. “రాజా సాబ్”కి ముందు.. హరి హర వీరమల్లులో రాకుమారి పాత్రలో నటించా. ఈ సినిమాలో ఏంజెల్‌గా కనిపించాను. ఇందులో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ వరకు కాకుండా మొత్తం కథ విన్నాను. కథ విన్నప్పుడే ఇది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని అర్థమైంది. అన్ని తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా దర్శకుడు మారుతి(Director Maruthi) చూపించారు. ఆ పాయింట్ యూనిక్‌గా అనిపించింది.

సప్తగిరి, ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేష్ ఇలా చాలా మంది కమెడియన్స్‌తో కలిసి సీన్స్ చేశాం. సెట్స్‌లో చాలా ఫన్‌గా ఉండేది. నేను హరి హర వీరమల్లుతోపాటు ఈ సినిమా షూటింగ్ కూడా చేశా. రెండు సినిమాల షూటింగ్స్ కోసం ట్రావెల్ వల్ల నిద్ర కూడా ఉండకపోయేది. ఆ టైమ్‌లో రాజా సాబ్ మేకర్స్ బాగా సపోర్ట్ చేశారు. నన్ను సెట్‌లో బాగా చూసుకునేవారు. అందుకే ప్రభాస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు.. నిధి అగర్వాల్ అంటే సెట్‌లో అందరికీ ఇష్టమని. ఈ కెరీర్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఇలా కష్టపడటం ఇబ్బందిగా అనిపించలేదు. ప్రభాస్‌తో వర్క్ చేయడం ప్లెజర్‌గా ఫీలయ్యా.

ఆయన.. తానొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అని ఎప్పుడూ అనుకోరు. మా అందరితో సరదాగా కలిసిపోయేవారు. ఆయనలోని మంచితనం, వినయం చూశాక.. మంచివాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుందనే విషయాన్ని మరింతగా నమ్మాను. హాస్పిటల్ సీన్‌లో ఆయన అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేశారు. ఆయనతో సెట్‌లో సినిమాలు, లైఫ్.. ఇలా అనేక విషయాల్లో చాలా సరదా సంభాషణలు జరిగేవి. డైరెక్టర్ మారుతి ఎంతో క్లారిటీగా ఈ సినిమాను రూపొందించారు. ఆయన సెట్‌కు వచ్చేప్పుడే ఏ సీన్ షూట్ చేయాలనేది క్లియర్‌గా ఉండేవారు. ఒకేసారి ఐదారుగురు ఆర్టిస్టులతో సీన్ చేయించడం ఈజీ కాదు.

ప్రతి ఒక్కరి టైమ్‌కు వ్యాల్యూ ఇవ్వాలి. మారుతితో వర్క్ చేయడం మా అందరికీ ఎంతో తేలిక. ఆయన సెట్‌లో సరదాగా ఉండేవారు. భారీ బడ్జెట్‌తో “రాజా సాబ్” లాంటి సినిమాను నిర్మించాలంటే ఎంతో ప్యాషన్ ఉండాలి. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఈ మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఎక్కడా విశ్వప్రసాద్ రాజీ పడలేదు. అందుకే ఇంత హైక్వాలిటీతో సినిమా వచ్చింది. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ అనే విషయం ముందే తెలుసు. ప్రభాస్‌తో నటించడం, ఇంత భారీ చిత్రంలో నేనూ ఒక భాగం కావడం హ్యాపీగా ఉంది.

విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సీన్‌లో యాక్టింగ్ కరెక్ట్‌గా చేసేందుకు కొంత టైం పట్టేది. లుక్ ఎక్కడ ఇవ్వాలి, లేనివి ఉన్నట్లు ఊహించుకొని రియాక్ట్ కావాలి. ఇలాంటివి కొన్ని సీన్స్ చేశాక ఈజీ అయ్యాయి. హారర్ మూవీస్ చేస్తున్నప్పుడు ఆ మూవీలోని యాక్టర్స్ తమకు కొన్ని అనూహ్యమైన ఘటనలు జరగడం చూశామని చెబుతుంటారు. కానీ మాకు అలాంటివేం ఎదురుకాలేదు. నిజానికి నాకు దెయ్యాలు, ఇలాంటి హారర్ కంటెంట్ అంటే భయం. రాత్రి నిద్రపోయేప్పుడు లైట్స్ వేసుకొని హనుమాన్ చాలీసా లూప్‌లో వింటూ నిద్రపోతా. టాలీవుడ్‌లో నేను భాగం. నాది తెలుగు సినిమా అని చెప్పుకుంటాను.
ఇటీవల ముంబై వెళ్లినప్పుడు అక్కడ తెలుగు సినిమాలు ఎంత క్వాలిటీగా, ఎంత పెద్ద స్కేల్‌లో జరుగుతున్నాయో నార్త్ వాళ్లు చెబుతుంటే విన్నాను. మా మూవీనే కాదు సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆదరణ పొందాలని కోరుకున్నా. మనమంతా ఒకే పడవలో వెళ్తున్నాం. ప్రమాదం జరగాలని చూస్తే అందరం మునిగిపోతాం. పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో హరి హర వీరమల్లులో నటించినప్పుడు ఆయనను పవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమైంది. చాలా ధైర్యంగా ఉంటారు. ప్రభాస్‌తో వర్క్ చేసినప్పుడు ఎంత ఎదిగినా వినయంగా ఎలా ఉండాలో అర్థమైంది. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నా.
ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తున్నా. హిందీలో రెండు మూవీస్ చేస్తున్నా. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నా. ఇక్కడికి షిప్ట్ అవుతున్నా. నా బాల్యం నుంచే హీరోయిన్ కావాలని కలగన్నా. నేను కలగన్న కెరీర్‌నే కొనసాగిస్తున్నా. కాబట్టి కొత్తగా నేను కోరేది ఏమీ లేదు. హీరోయిన్‌గా మంచి పర్పస్‌ఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తున్నా’.
