Monday, February 9, 2026
Homeమెదక్‌Chilipched | దారుణం…పెంటకుప్పపై దొరికిన పసికందు

Chilipched | దారుణం…పెంటకుప్పపై దొరికిన పసికందు

  • అక్కున్న చేర్చుకున్న తండావాసులు

పుట్టిన పసికందును పొలం పక్కకు ఉన్న పెంటకుప్పపై వదిలిపెట్టి వెళ్లిన సంఘటన చిలిపిచేడ్ మండలంలో కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…చిలిపిచేడ్ మండలంలోని బద్రియా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పొలం పక్కకు ఉన్న పెంటకుప్పపై ఒక మగ బిడ్డను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు.గుక్క పెట్టి ఆపకుండా ఏడుస్తున్న బిడ్డను స్థానికులు గమనించి అంగన్వాడీ టీచర్ అనితకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న ఆమె ఆ మగ బిడ్డను అక్కున చేర్చుకొని పోలీసులకు సమాచారం అందించింది.

అక్కడికి చేరుకున్న పోలీసులు అంగన్వాడీ టీచర్ కలిసి హుటాహుటిన మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బిడ్డకు చికిత్స అందిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్ అనిత తెలిపారు.ఆ బిడ్డ పుట్టి ఒకటి రెండు రోజులు కావచ్చు అని,బిడ్డ బరువు 3.0కిలోలు ఉందని,బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించారని అనిత పేర్కొన్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News