Homeనల్లగొండDevender Reddy | మోసపూరిత హామీలను ఎండగట్టండి.

Devender Reddy | మోసపూరిత హామీలను ఎండగట్టండి.

  • జిహెచ్ఎంసి కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అదివారం ఆలేరు పట్టణంలోని 3,4,8, వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. మల్లాపురం కార్పొరేటర్ పొన్నాల దేవేందర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు.

వార్డుల్లోని ఇంటింటికీ మరియు వ్యాపార సముదాయాలకు వెళ్లి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలేరు జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ప్రజలకు ఇచ్చిన ఆచరణ సాధ్యం కాని, మోసపూరిత హామీల తాలూకు బాకీ కార్డును ప్రజలకు పంపిణీ చేశారు.

- Advertisement -
BRS Election Campaign in Alair Town

ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలను నమ్మించి వంచించిందని ఆయన విమర్శించారు. అభివృద్ధిని కాంక్షించే వారంతా కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ భద్రుద్దీన్, కృష్ణ గౌడ్,బేతి రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News