Thursday, March 26, 2026
Homeవరంగల్‌Honour | మండల అధికారులకు సన్మానం

Honour | మండల అధికారులకు సన్మానం

  • నూతన సర్పంచ్ డెక్క సునిత – కుమారస్వామి.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన వడ్లకొండ గ్రామ నూతన సర్పంచ్ దంపతులు డెక్క సునిత -కుమారస్వామి స్థానిక మండల అధికారులు తహసీల్దార్ టీ.వెంకటస్వామి, ఎంపీడీఓ మాలోత్ శంకర్ నాయక్, ఏపిఓ సుశీల్ కుమార్ లను మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాలతో సన్మానించారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ఆయా అధికారులను కలుస్తూ పరిచయాలను పెంచుకుంటూ సమస్యల సాధనకు సహకారం అందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమడగాని రాజు యాదవ్, దాడి సదానందం, రవికుమార్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News