Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణOsmania Hospital | రెండేళ్లు టార్గెట్

Osmania Hospital | రెండేళ్లు టార్గెట్

  • గోషామహల్ వద్ద కొత్త ఉస్మానియా ఆస్పత్రి
  • వందేండ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించాలె
  • ఆధునిక పద్దతుల్లో అవసరాల మేరకు నిర్మాణాలు
  • ఆస్పత్రికి అవసరమైన వైద్య పరికరాలు సిద్దం చేయాలి
  • ప్రజలకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో ముందుకు..
  • పనుల వేగవంతానికి అధికారుల సమన్వయ కమిటీ
  • తరుచూ క్షేత్ర స్థాయిలో పనుల పర్యవేక్షణ చేయాలె
  • అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

గోషామహల్ వద్ద చేపట్టిన ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశిం చారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులకు సీఎం సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్అండ్్బ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పది రోజులకోసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పనుల వేగవంతానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వందేళ్ల అవసరాలకు తగిన సదుపాయాలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి ఉండాలని.. ఆధునిక వైద్య పరికరాలతో అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్మాణ సమీక్ష చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరా బాద్ తో పాటు జిల్లాల్లోనూ ఆసుపత్రుల పనుల పర్యవేక్షణకు అధికారుల నియామకం జరిగిందన్నారు. వచ్చే జూన్ నాటికి అన్ని మెడికల్ కళాశాలలు, ఆసుపత్రుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్, భద్రతా ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు, శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఎంఏ అండ్ యూడీ సెక్రటరీ ఇలంబర్తి, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News