Friday, October 3, 2025
ePaper
Homeజాతీయంఊరిస్తున్న కొత్త ఆదాయపన్ను చట్టం

ఊరిస్తున్న కొత్త ఆదాయపన్ను చట్టం

  • పాతది ఉంటుందా.. కొత్తది వస్తుందా..?
  • ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పార్లమెంట్‌ బడ్జెట్‌(Budget) సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ప్రస్తుత ఐటీ చట్టాన్ని సరళీకృతం చేయడం, దానిని అర్థమయ్యేలా చేయడం, పేజీల సంఖ్యను దాదాపు 60 శాతం తగ్గించడమే లక్ష్యంగా ఉంటుందని సంకేతాలు అందుతున్నాయి. బడ్జెట్‌(Budget) సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశ పెట్టవచ్చు. ఆరు దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని ఆరు నెలల్లోపు సమగ్రంగా సవిూక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై బడ్జెట్లో ప్రకటించారు. ఓ నివేదిక ప్రకారం ’కొత్త ఆదాయపు పన్ను చట్టం పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టబడుతుంది. ఇది కొత్త చట్టం అవుతుంది. ఇది ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ప్రస్తుతం చట్టం ముసాయిదాను పరిశీలిస్తోంది. మంత్రిత్వ శాఖకు దీనికి ఆమోద ముద్ర వేయనుంది. బడ్జెట్‌(Budget) సమావేశాల రెండో భాగంలో ఇది ఆమోదించ బడుతుంది. ఆ తర్వాత దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరుగుతాయి. బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరుగుతాయి. 2025-26 కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1న సమర్పించబడుతుంది. పార్లమెంటు మార్చి 10న తిరిగి ప్రారంభమై ఏప్రిల్‌ 4 వరకు కొనసాగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News