Monday, January 19, 2026
EPAPER
Homeహైదరాబాద్‌Hyderabad Press Club | నూతన పాలక మండలి బాధ్యతల స్వీకరణ

Hyderabad Press Club | నూతన పాలక మండలి బాధ్యతల స్వీకరణ

ప్రెస్ క్లబ్‌ను ఫ్యామిలీ క్లబ్‌(Family Club)గా మార్చి తీరుతాం: కొత్త కార్యవర్గం హామీ

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ 2025- 2027 నూతన కార్యవర్గం (new working group) నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టింది. ఇటీవలి ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానల్ (Friends Panel) ఘన విజయం సాధించింది. సోమాజిగూడ (Somajiguda) ప్రెస్ క్లబ్ ఆవరణలో నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.విజయ్ కుమార్ రెడ్డి, రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులుగా అరుణ అత్తలూరి, ఏ .రాజేష్, జాయింట్ సెక్రటరీలుగా చిలుకూరి హరిప్రసాద్, బాబురావు, ట్రెజరర్‌గా రమేష్ వైట్ల బాధ్యతలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్.ఉమాదేవి, మర్యాద రమాదేవి, కళ్యాణం రాజేశ్వరి, శంకర్, కస్తూరి శ్రీనివాస్, నాగరాజు శ్రీనివాస్ రెడ్డి, రచన, అశోక్ దయ్యాల, సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, అమిత్ బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ (Devulapalli Amar) సమక్షంలో పాత పాలక మండలి మినిట్స్ బుక్ ను నూతన కార్యవర్గానికి అందజేసింది. ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి సహాయ కార్యదర్శి కొండ శ్రీనివాసులు నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులకు ఎన్నికైనసర్టిఫికెట్లను ప్రధానం చేశారు.తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక క్లబ్ గా పేరున హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం పని చేయాలని నూతన పాలకమండలికి సీనియర్ పాత్రికేయులు సూచించారు. తమపై ఎంత విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా పనిచేస్తామని నూతన పాలకమండలి ప్రకటించింది. ఎన్నికల వరకే వేరువేరు ప్యానల్స్ అని ఎన్నికలు ఎన్నికలు ముగిశాక పోటీ చేసిన వారందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని నూతన పాలకమండలి తెలిపింది.

ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్. వేణుగోపాల్ నాయుడు, ఆర్ రవికాంత్ రెడ్డిలు తమ బాధ్యతలను కొత్త కమిటీకి అప్పగించారు. ఆరు దశాబ్దాల చరిత్ర గల ప్రెస్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ గా మార్చడంతో పాటు సభ్యులకు ఇచ్చిన హామీలన్నింటిని నిలుపుకుంటామని నూతన పాలకమండలి ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. నవంబర్ లో ఫ్యామిలీ గెట్ టుగెదర్ నిర్వహించడంతోపాటు వివిధ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పాలకమండలి ఈ సందర్భంగా వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, రాష్ట్రబీసీ బిసి కమిషన్ సభ్యులు సురేందర్, జనం సాక్షి అధినేత రెహమాన్, సీనియర్ పాత్రికేయులు, సీజీకే మూర్తి సహా పలువురు సీనియర్ జర్నలిస్టులు బి కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News