Wednesday, February 11, 2026
HomeజాతీయంNDWBF | ప్రపంచ అతిపెద్ద పుస్తక ప్రదర్శన

NDWBF | ప్రపంచ అతిపెద్ద పుస్తక ప్రదర్శన

ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శన(World’s Largest Book Fair)ను న్యూఢిల్లీలో ఏర్పాటుచేశారు. న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్(New Delhi World Book Fair-NDWBF)-2026.. జనవరి 10 నుంచి 18 వరకు జరుగుతుంది. భారత్ మండపంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి(Union Minister for Education) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ప్రారంభిస్తారు. NDWBFకి సంబంధించి ఇది 53వ ఎడిషన్. నేషనల్ బుక్ ట్రస్ట్(National Book Trust) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్‌కి తొలిసారిగా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఇందులో 35 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా పబ్లిషర్లు పాల్గొంటున్నారు. 3 వేలకు పైగా స్టాల్స్, 600 లిటరరీ, కల్చరల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. వెయ్యి మందికిపైగా స్పీకర్లు పాలుపంచుకుంటారు. ఈ ఏడాది థీమ్: Indian Military History: Valour & amp; Wisdom @ 75.

- Advertisement -
RELATED ARTICLES

Latest News