కింగ్ (King) ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు(Sri Vishnu), యదునాథ్ మారుతీ రావు, సుమంత్ నాయుడు.జి, SSC ప్రొడక్షన్ నంబర్ 3లో హీరోయిన్‌గా నయన్ సారిక (Nayan Sarika) ఎంపికయ్యారు. శ్రీవిష్ణు యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ సబ్జెక్ట్స్ చేస్తూ ప్రతి సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో క్రేజీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు.జి నిర్మిస్తుండగా హేమ & షాలిని సమర్పిస్తారు, సుబ్రహ్మణ్యం నాయుడు.జి, రామాచారి.ఎం సహ నిర్మాతలు.

ఈ చిత్రంలో సక్సెస్ ఫుల్ హీరో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆమెకు బర్త్ డే విషెష్ అందిస్తూ ఒక స్పెషల్ వీడియోని రివీల్ చేశారు. ఈ వీడియో(Video) చాలా ఎంటర్‌టైనింగ్(Entertaining)గా ఉంది. ఈ చిత్రం ఒంగోలు (Ongole) పట్టణం నేపథ్యంలో సాగనుంది. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో శ్రీవిష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. తన సిగ్నేచర్ చార్మ్‌తో అలరించనున్నారు. ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని కీలక పాత్రల్లో నటించారు. స్టార్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ కాగా రధన్ సంగీతం సమకూరుస్తారు. ఎ.రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.

తారాగణం: శ్రీవిష్ణు, నయన్ సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
డీవోపీ: సాయి శ్రీరామ్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
పీఆర్వో: వంశీ-శేఖర్
