Thursday, February 19, 2026
HomeజాతీయంDisruption | విమాన సర్వీసులకు అంతరాయం..

Disruption | విమాన సర్వీసులకు అంతరాయం..

  • ఇబ్బందులపాలైన వేలాదిమంది ప్రయాణికులు..
  • నేవిటేర్ వ్యవస్థలో సాంకేతిక లోపం..

నెవిటేర్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా యూరప్‌ తోపాటు ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ఎయిర్‌పోర్టులలో విమాన సర్వీసుల కు అంతరాయం ఏర్పడింది. దాంతో వేలమంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. నెవిటేర్‌ వ్యవస్థలో దాదాపుగా 45 నిమిషాలపాటు సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి నెలకొంది.

దేశ రాజ‌ధానిలోని భార‌త్ మండ‌పంలో ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. కృత్రిమ మేధ‌పై జ‌రుగుతున్న ఆ స‌ద‌స్సులో ఓ అనూహ్య స‌న్నివేశం చోటుచేసుకున్న‌ది. రెండు దిగ్గ‌జ ఏఐ కంపెనీల మ‌ధ్య ఉన్న విబేధాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి. గ్రూప్ ఫోటో కోసం వేదిక‌పై నిలుచున్న ఏఐ ప్ర‌తినిధులు చేతులు జోడించే స‌మ‌యంలో.. రెండు కంపెనీల‌కు చెందిన లీడ‌ర్లు త‌మ చేతుల‌ను ఒక‌ర్ని ఒక‌రు ప‌ట్టుకోలేదు. ప్ర‌పంచ మీడియా ముందే ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాని మోదీ చూస్తుండ‌గానే ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

- Advertisement -

ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్‌, ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడీ .. ప‌క్క‌ప‌క్క‌నే నిలుచున్నా.. ఆ ఇద్ద‌రూ త‌మ చేతుల‌ను ప‌ట్టుకోలేదు. దీనికి బ‌దులుగా ఆ ఇద్ద‌రూ ప‌డికిలి బిగించి చేతుల‌ను పైకి ఎత్తారు. ఏఐ లీడ‌ర్లు అంద‌రూ వ‌రుస‌గా నిల‌బ‌డ్డా.. ఆ ఇద్ద‌రూ అయిష్టంగానే ప‌క్క‌ప‌క్క‌నే నిలుచున్నారు. కానీ చేతుల‌ను క‌లుప‌డానికి వ్య‌తిరేకించారు. వ‌రుస క్ర‌మాన్ని బ్రేక్ చేసి కేవ‌లం పిడికిలి మాత్ర‌మే బిగించారు. దీంతో ఆ ఘ‌ట‌నకు చెందిన పిక్స్‌, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

కృత్రిమ మేధ‌పై ప‌నిచేస్తున్న ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి అమడీ ఎప్పుడో వెళ్లిపోయారు. ఏఐని క‌మ‌ర్ష‌లైజ్ చేస్తున్న‌ట్లు ఆరోపించారు. భ‌ద్ర‌త‌పై ఫోక‌స్ చేయ‌డం లేద‌న్న ఉద్దేశంతో ఆ కంపెనీ వీడారు. అయితే సేఫ్ట్ ముఖ్య‌మ‌న్న ల‌క్ష్యంతో ఆంథ్రోపిక్ కంపెనీ పెట్టారు అమోడీ. ఏఐ టెక్నాల‌జీ అనేది కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు చేరాల‌ని ఆల్ట్‌మ్యాన్ భావిస్తున్నారు.

అయితే ఇది సాధ్యం కావాలంటే .. ఓపెన్ ఏఐ త‌మ ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా క‌మ‌ర్ష‌లైజ్ చేయాల‌ని ఆల్ట్‌మ్యాన్ ప్ర‌య‌త్నిస్తున్నారు. స‌ర్వీసులు అందుబాటులో ఉండాలంటే అడ్వ‌ర్టైజింగ్ అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అయితే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ మ‌ధ్య ఉన్న శ‌త్రుత్వం ఇవాళ .. భార‌త మండ‌పం వేదిక‌పై స్ప‌ష్టంగా క‌నిపించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News