జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ (Naveen Yadav) ఈరోజు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ B-ఫామ్(B-form)ను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ (Mahesh Kumar Goud) చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, విలువలు, నాయకుల ఆశీస్సులు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజల విశ్వాసం తనకు ప్రేరణ అని చెప్పారు. తాను వేసే ప్రతి అడుగు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమేనని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో యువ నాయకుడు నవీన్ యాదవ్ విజయం ప్రజల విజయంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
