- మండల తహాసిల్దార్ వెంకటస్వామి ఆధ్వర్యంలో
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో “జాతీయ ఓటు హక్కు దినోత్సవం” సందర్భంగా… స్థానిక తహాసిల్దార్ టీ.వెంకటస్వామి ఆధ్వర్యంలో.. తహాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సోషల్ వెల్ఫేర్ విద్యార్థినీలు, తహాసిల్దార్ కార్యాలయ సిబ్బంది, సెర్ప్ సిబ్బందితో కలిసి16వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించి, ఓటర్ ప్రతిజ్ఞ చేసి, సీనియర్ ఓటర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఓటర్ల ప్రతిజ్ఞ.
భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష, ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

