నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రముఖ పాఠశాలలో సివి రామన్ జన్మదిన పురస్కరించుకొని ఘనంగా సైన్స్ డే సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామ నంద్ విచ్చేసి విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన రకరకాల నమూనాలను చూసి వాటి పనితీరును అడిగి తెలుసుకుని అభినందించారు.
అందులో ముఖ్యంగా అందులు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం అమర్చిన చేతి కర్ర యొక్క పనితీరును చూసి అది తయారు చేసిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. తదనంతరం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ సి.వి.రామన్ సైన్స్ లో చేసిన పరిశోధనల గొప్పతనం ఆవిష్కరణల గూర్చి ప్రసంగించడం జరిగింది అలాగే పాఠశాల చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…

సివి రామన్ జీవిత చరిత్రను తెలియజేస్తూ ఇలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని సైన్స్ లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి దేశానికి సేవ చేయాలని విద్యార్థిని విద్యార్థులకు ప్రేరణ కలిగించారు అలాగే పట్టణంలోని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ బండి సుమన్ మాట్లాడుతూ, నిత్యజీవితంలో సైన్స్ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది.
తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల చైర్మన్ నర రాజేందర్ రెడ్డి క రెస్పాండెంట్ నరహరి స్వాతి రాజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ రాకేష్ ల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
