- ప్రిన్సిపాల్ పి అపర్ణ ఆధ్వర్యంలో.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని పీఎం శ్రీ టీ.జీ ఎస్డబ్ల్యు ఆర్‌ఎస్ /జూనియర్ కాలేజ్ (గర్ల్స్) లో జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు, సైన్స్ పట్ల ఆసక్తిని అభివృద్ధి చేయేందుకు నిర్వహించబడింది.

ఈ సందర్భంగా పాఠశాలలో పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వాటిలో సైన్స్ ప్రయోగాలు వ్యాసరచన పోటీలు క్విజ్ పోటీలు పోస్టర్ మేకింగ్ పోటీలు సైన్స్ మేళా సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థినులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆవిష్కరణలను ఆవిష్కరించారు.
అన్ని కార్యక్రమాలలో విద్యార్థినులు అత్యంత ఆసక్తి, ఉత్సాహంతో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. సైన్స్ ఉపాధ్యాయులు జ్యోత్స్నా, ప్రవళిక, స్వాతి, మాధవి, సంధ్య, రేష్మ వీణ ఉపాధ్యాయ బృందం కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. వారి మార్గదర్శకత్వంలో విద్యార్థినులు శాస్త్ర విజ్ఞానంపై లోతైన అవగాహన పొందారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి. అపర్ణ మాట్లాడుతూ, జాతీయ సైన్స్ దినోత్సవం విద్యార్థినుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసి అందరి ప్రశంసలను అందుకుంది.
