Saturday, February 28, 2026
Homeవరంగల్‌Parvathagiri | విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.

Parvathagiri | విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.

  • విస్డం పాఠశాల ప్రిన్సిపల్ దేవేందర్

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని విస్డం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థుల ఎగ్జిబిట్స్, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య శనివారం వైభవంగా జరుపుకున్నారు. విద్యార్థులు తాము రూపొందించిన శాస్త్రీయ ప్రదర్శనలను ప్రదర్శించి వారి సృజనాత్మకతను చూపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ దేవేందర్, డైరెక్టర్స్ సుధాకర్, శ్రీనివాస్ లతో కలిసి సి.వి. రామన్ చిత్ర పటానికి పూలమాలవేసి విద్యార్థులకు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ అనేది మానవ జీవితంలో ఒక భాగమని, మానవ నాగరికత అభివృద్ధి చెందడానికి శాస్త్రీయ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడిందని రాబోయే కాలంలో అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తుందని, సైన్స్ లేని ప్రపంచాన్ని మనము ఊహించలేము అన్నారు. విద్యార్థులు తమ ఆలోచన శక్తిని, సృజనాత్మకతను జోడించి భవిష్యత్తులో భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా అభివృద్ధి చెందాలని, చంద్రశేఖర వెంకట రామన్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలలో మరియు క్విజ్ లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినులు ఇంద్రజ, సునీత, పూజిత, సుమలత, శ్రీలేఖ, స్వాతి, మౌనిక, మానస, స్వస్తిక, కస్తూరి, ధరణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News