Tuesday, February 10, 2026
HomeతెలంగాణPonnam | జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభం

Ponnam | జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభం

రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్యను తగ్గించాలి
ఈ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు భాగస్వామ్యం కావాలి
ఆర్టీసీలో జీరో ప్రమాదాలే లక్ష్యంగా పనిచేయాలి
30 ఏళ్లకు పైగా ఒక్క ప్రమాదం లేకుండా ఆర్టీసీ బస్ నడుపుతున్న డ్రైవర్లకు అభినందనలు
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభోత్సవం మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల రేటు(Road Accidents Death Rate) తగ్గించడమే లక్ష్యంగా జనవరి 1 నుంచి 31 వరకు జరిగే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల(National Highway Safety Month Celebrations)ను ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి(Minister of Transportation and BC Welfare) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 26 వేల రోడ్డు ప్రమాదాలు, 8 వేల మరణాలు సంభవిస్తుండగా ప్రతి రోజు 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారుల తలకు హెల్మెట్ పెట్టారు. రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను, వాహనాల స్టికర్‌ను, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ బుక్స్ రిలీజ్ చేశారు. రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్‌పై ఆటోలకు పోస్టర్ అతికించారు. విద్యార్థులతో రోడ్ సేఫ్టీ‌పై ఫ్లకార్డులు పట్టుకొని అవగాహన కల్పించారు.

- Advertisement -

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్‌లో రావడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం అని రవాణా శాఖ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నుంచి ఒక్క ప్రాణాన్ని కాపాడినా.. జీవితం సార్థకమవుతుందన్నారు. ఈ సంవత్సరం సడక్ సురక్ష-జీవన్ సురక్ష(Sadak Suraksha-Jeevan Suraksha) నినాదంతో కార్యక్రమాన్ని 4ఈ ద్వారా ముందుకు తీసుకుపోతున్నామని వెల్లడించారు. ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బాక్స్ స్పాట్స్ తొలగించి ప్రమాదాలను నివారించాలని అధికారులకు సూచించారు.

ఇది కేవలం రవాణా శాఖ, ఆర్టీసీ మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు, ఆర్ అండ్ బీ, విద్యా శాఖ, ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని నెల రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. రవాణా శాఖ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో రోడ్డు నిబంధనలు పాటిస్తామనే హామీ పత్రం తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే కోటీ 80 లక్షల వాహనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరు స్వీయ నిర్వహణ పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వాహనాల లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ చిల్డ్రన్ అవేర్‌నెస్ పార్క్ ఏర్పాటుపై నిరక్ష్యాన్ని వీడాలని హెచ్చరించారు.

ఆర్టీసీ కళా భవన్‌లో రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమాన్ని ప్రారంభించి.. గత 30 సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్నా ఒక్క ప్రమాదం కూడా జరగని డ్రైవర్లను అభినందించి సత్కరించారు. ఆర్టీసీలో 20 వేల మంది డ్రైవర్లు, 10 వేల బస్సులు ఉన్నాయని, ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులను 39 లక్షల కిలోమీటర్ల మేర తీసుకెళ్లి గమ్యాలను చేరుస్తున్నాయని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ 2026లో పాత బకాయిలు పోయి మరింత లాభాల్లోకి వచ్చేలా అందరం కృషి చేద్దామని వెల్లడించారు. ఆర్టీసీ ప్రమాదాలను జీరోకి తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్ మాట్లాడుతూ వాహనాల ఫిట్‌నెస్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కమర్షియల్ వాహనాలను కట్టడి చేయాలని సూచించారు. హెవీ వెహికల్ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని , వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రమాదాలను నివారించడానికి ఒక సంవత్సర కాలంలో 100 బ్లాక్ స్పాట్ గుర్తించి తొలగించారని, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొనాలని సూచించారు.

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.07 శాతం ప్రమాదాలు ఉన్నాయని, సంవత్సర కాలంలో 600 ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి డిపోలో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం, బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడం, సిబ్బందికి వైద్య పరీక్షలు, బస్సుల ఫిట్‌నెస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలు శాశ్వత వికలాంగులు అయినవారి కుటుంబాలు జీవితాంతం ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆర్టీసీ ప్రతి సంవత్సరం రూ.80 కోట్లను ప్రమాద బీమాకి చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివలింగయ్య, డీటీసీలు, స్టేట్ ఆర్టీఏ మెంబర్ నవీన్, జిల్లా ఆర్టీఏ సురేష్ లాల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News