- కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కుట్రపూరితంగా వేధింపులకు గురి చేయడంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల బిజెపి కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలని, ఏఐసీసీ పిలుపు మేరకు చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం. ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని కరీంనగర్ పోలీసులు వారిని అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టులు కాంగ్రెస్ అగ్ర నేతల ప్రమేయం లేదని తీర్పు ఇచ్చిందని అయినప్పటికీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడి సిబిఐ లను జేబు సంస్థలుగా వాడుకుంటూ రాజకీయంగా వారిని అణగదొక్కాలని ప్రతీకార చర్యలకు పాల్పడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ శ్రేణులు బిజెపి నాయకులను ప్రజా క్షేత్రంలో తిరగనివ్వబోమని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు.
