Wednesday, February 25, 2026
Homeహైదరాబాద్‌OU | ఉస్మానియా యూనివర్సిటీ లో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు

OU | ఉస్మానియా యూనివర్సిటీ లో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు

ఉస్మానియా యూనివర్సిటీ కృత్రిమ మేధ మరియు యంత్ర అభ్యసన విశిష్ట కేంద్రం ఆధ్వర్యంలో “కృత్రిమ మేధ ఆధారిత స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ మరియు సమాచార ప్రసారం అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది.ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం సదస్సును ప్రారంభించి,భారతదేశం ప్రపంచ కృత్రిమ మేధా కేంద్రంగా ఎదగబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పాఠ్యప్రణాళికలో నైతిక,బాధ్యతాయుత కృత్రిమ మేధకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.కళాశాల ప్రాచార్యులు ఆచార్య పి.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సంచాలకులు ఆచార్య పి.వి.సుధ స్వాగత ప్రసంగం చేశారు.ఆరోగ్య సంరక్షణ,స్వయంప్రతిపత్తి వ్యవస్థలు,పారిశ్రామిక రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై పలువురు నిపుణులు ప్రసంగించారు.పరిశోధన,నైపుణ్యాభివృద్ధి మరియు పరిశ్రమల భాగస్వామ్యానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News