- నగదు సేకరణలో కార్యకర్తల బిజీ బిజీ…
- ఒక్కో కౌన్సిలర్ కోటి రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధం…
- చైర్మన్ రేసులో మూడు కోట్లు అవసరమంటున్న పార్టీలు
త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలో ఉవ్విళ్లూరుతున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలెంట్ గా కసరత్తు చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డుల వైజు రివ్యూ నిర్వహిస్తూ పార్టీ బలం ఎంత గెలుస్తామా ఓడుతామా ఆశావాహులు ఎంతమంది ఉన్నారు అనే కోణంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిజెపి పార్టీ ఈసారి ఎలాగైనా మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగరవేయాలని జిల్లా రాష్ట్ర నాయకులతో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడానికి సమావేశాలు పెడుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో గతంలో 24 వార్డులు ఉండగా చుట్టుపక్కల 8 గ్రామాలను విలీనం చేయడంతో 30 వార్డులుగా విభజించారు. ఒకపక్క అధికారులు వార్డుల విభజనపై ఓటర్ల విభజనపై కసరత్తు నిర్వహిస్తున్న క్రమంలో ఆయా పార్టీలు రెండు నెలల లోపు ఎన్నికలు జరుగుతాయని భావించి ముందస్తు భారీగా ప్రణాళికలు వేసుకుంటున్నారు.
30 వాటిలో ఉన్న నర్సంపేట మున్సిపాలిటీ పై ఎంత కష్టమైనా పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ఆయా పార్టీల జెండాలు ఎగరవేయాలని అందుకు భారీగా డబ్బు అవసరం ఉంటుందని ముందుగానే ఎవరికి వారు నగదును సమీకరించడంలో బిజీ బిజీగా మారిపోతున్నారు. ముందుగా ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా మరి ఏమైనా మార్పులు ఉంటాయని సందిగ్ధంలో కొంతమంది ఆశావాహులు ఊగిసలాడుతున్నారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల వలె కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సంపాదించి చైర్మన్ పదవిని పొందడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వారు భావిస్తూ చైర్మన్ పదవి కోసం మూడు కోట్ల నుండి ఐదు కోట్ల వరకు ఖర్చులు అయి ఉంటాయని అందుకు నగదు సమీకరించుకోవాలని చర్చలు జరుగుతున్నాయి.

అదేవిధంగా నర్సంపేట మున్సిపాలిటీ పై ఎలాగైనా బిఆర్ఎస్ జండా ఎగరవేయాలని స్వయంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రంగంలోకి దిగి వార్డుల వైజ్ గా రివ్యూ నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ఆశావాహుల పేర్లను సేకరిస్తున్నారు. ఇక బిజెపి పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహిస్తూనే కార్యకర్తల కోసం ఆశావాహుల కోసం ఆరాలు తీస్తున్నారు. ఇంకా సిపిఎం పార్టీ ఎన్సిపిఐ సిపిఐ పార్టీలు సైతం భావజాల పార్టీలతో చేతులు కలపడానికి సిద్ధమవుతూ కొన్ని పార్టీల నాయకులు స్వతంత్రంగానే పోటీకి సిద్ధమవుతు ముందుకు కదులుతున్నారు. గత మున్సిపల్ కౌన్సిలర్ల విషయంలో అవిశ్వాసాలు సొంత పార్టీలోనే జరిగినప్పటికీ చైర్మన్ కు వ్యతిరేకంగా కొంతమంది చైర్మన్ కు సానుకూలంగా కొంతమంది ఉండడంతో టిఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. మెజార్టీ సభ్యులు అవిశ్వాసం దిశగా అడుగులు వేయడంతో చైర్పర్సన్ కు సానుకూలంగా కొంతమంది కౌన్సిలర్లు ఉండగా చైర్పర్సన్ తో పాటు చైర్పర్సన్ కు సానుకూలంగా ఉన్న కౌన్సిలర్ల పై వెటు పడింది.
అందులో కొందరు ఉద్యమకారులు ఉండగా వారి పయనం ఎటు అనేది ప్రశ్నార్థకంగా మారడంతో స్వతంత్రంగానే పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నర్సంపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే నోట్ల కట్టలు భారీగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందేమోనని ఉంటుందేమోనని అన్ని పార్టీల నాయకులు గుర్తించడం గమనార్వం గుర్తించడం గమనార్హం. గత రెండేళ్ల నుండి మున్సిపాలిటీ పాలకవర్గం లేకపోవడంతో రాముడు లేని అయోధ్యల మున్సిపాలిటీ వ్యవహారం మారిపోయింది. సమస్యలు ఎక్కడికి అక్కడే పెనవేసుకొని పేరుకుపోయాయి. కొత్తగా వచ్చే పాలకవర్గానికి నర్సంపేటలో పేరుకుపోయిన సమస్యలపై పోరాటం చేయాలంటే ఏడాది కాలం పాటు పడక తప్పదని పలువురు పట్టణ వాసులు భావిస్తున్నారు.

