Tuesday, March 3, 2026
Homeవరంగల్‌MLA | 80 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులు

MLA | 80 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులు

  • నర్సంపేట పట్టణ మహిళా సమాఖ్యలకు 60 కోట్ల రూపాయల మిత్తి లేని రుణాలు.
  • జిల్లా ఆస్పత్రికి డబ్బులు ఇప్పించింది నేనే.దొంతి
  • 600 కోట్లు ఖర్చు చేసి త్రాగునీరు ఇవ్వలేని బిఆర్ఎస్ ప్రభుత్వం
  • కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది….
  • మున్సిపాలిటీ పరిధిలో 700 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మాది.
  • రెండేళ్లలో ప్రజలు చెప్పుకునే స్థాయిలో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…
  • నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి

80 కోట్ల రూపాయలతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు ,డ్రైనేజీలు, కల్వర్టులు అభివృద్ధి పనులు చేస్తున్నాం అని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..

నర్సంపేట పట్టణ అభివృద్ధి తో పాటు నియోజకవర్గ అభివృద్ధి పట్ల గత బిఆర్ఎస్ నాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా అమలుపరుస్తున్నామని తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసిన, అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆ దిశగానే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీనా అమలు అంచలంచలుగా చేపట్టి తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు.

- Advertisement -

ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రేషన్ షాపుల్లో సన్నబియ్యం, ఉచిత విద్యుత్తు, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని , 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో అనేకమార్లు ప్రజలతో దరఖాస్తు చేయించి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడ ఇవ్వలేని అసమర్ధులు ఈరోజు సమావేశాలు పెట్టి ఇళ్లలో తిరుగుతూ 6 గ్యారంటీల పట్ల అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని, మహిళా సంఘాలకు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 60 కోట్ల రూపాయలు వడ్డీనేని రుణాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని వివరించారు.

నర్సంపేట పట్టణంలో 12 మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం చేస్తున్నామని… ఏడు సంఘాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయని మరో ఐదు సంఘాల భవనాలకు నేడు భూమి పూజ చేస్తున్నామని అన్నారు. కుల సంఘాల భవనాల పేరుతో వారిని మోసం చేసి నేడు ప్రజల వద్దకు పోవడానికి కనీస ఇంగిత జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు… దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నర్సంపేట నియోజకవర్గంలో మిషన్ భగీరథ పైపులు వేస్తామని డబ్బు ఖర్చు చేసినప్పటికీ 2014 కంటే ముందు ఉన్న పరిస్థితి కంటే ఏ మాత్రం మెరుగు పడలేదని ప్రస్తుతం

నర్సంపేట పట్టణంలో త్రాగు నీటి ఎద్దడిని తీర్చేందుకు అమృత్పత్కంలో 30 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు నిర్మాణం జరుగుతున్నాయని, అంతేకాకుండా గతంలో నిర్మాణం చేసిన డీప్ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ పునరుద్ధరణకు 10 కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించానని నర్సంపేట పట్టణ ప్రజలకు 7/24 రీతిలో త్రాగునీరు అందించిన తర్వాతనే మరోసారి ఎమ్మెల్యే ఎన్నికలకు ఓటు అడుగుతానని ఈరోజు నాకు ప్రత్యక్షంగా ఎన్నికలు లేవని రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే విధంగానే అభివృద్ధి చేస్తానే తప్ప….

ముఖం తుడుచుకునేలాంటి చిత్తి కాగితాలతో జీవోలు తేనని.. నేను తెచ్చిన ప్రతి జీవో నేడు పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. 45 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ప్రజానాయకుడిగా కొనసాగుతున్నానని ప్రజల ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేస్తున్నానని ఎన్నికలు రాగానే ప్రజల వద్దకు వెళ్లి ఇండ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకోవడం ప్రభుత్వ పథకాల పేరుతో దరఖాస్తులు తీసుకోవడం మాకు తెలవదు అన్నారు…..

కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, మా ధ్యేయమని దొంతి మాధవరెడ్డి అన్నారు. 365 నేషనల్ హైవే గచ్చిరోల్ నుండి రేణిగుంట వరకు నర్సంపేట మీదుగా తీసుకొచ్చిన ఘనత నాదని, నర్సంపేట పోలీస్ స్టేషన్ నుండి మాదన్నపేట వరకు డ్రైన్ టు డ్రైన్ సిసి రోడ్డు వేయించి నర్సంపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను సైతం అభివృద్ధి చేస్తున్నామని రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల మన్నలను పొందే వ్యక్తులకే అవకాశాలు ఇచ్చి ప్రజల సౌకర్యాల కోసం సేవలందించే వ్యక్తులను ప్రజల ముందు నిలబెడతామని వారిన ఆశీర్వదించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టిపిసిసి సభ్యుడు పెండెం రామానంద్ ఓబిసి జిల్లా చైర్మన్ ఒర్సు తిరుపతి నర్సంపేట పిఎసిఎస్ మాజీ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News