Wednesday, March 4, 2026
Homeవరంగల్‌Help | బట్టల షాప్ షార్ట్ సర్క్యూట్ బాధితునికి 1 Lakh సాయం

Help | బట్టల షాప్ షార్ట్ సర్క్యూట్ బాధితునికి 1 Lakh సాయం

నర్సంపేట పట్టణంలో జయశ్రీ టాకీస్ ప్రక్కన శివరామ క్లాత్ స్టోర్(shivarama cloth store) సోమవారం తెల్లవారుజామున అనుమాన స్పదమైన ఫైర్ ఆక్సిడెంట్(Fire Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో అదృష్టం కొద్ది ప్రాణా నష్టం జరగలేదు. శివరామకృష్ణ క్లాస్ స్టోర్ ఓనర్ బొప్పరాతి రాజు(Bopparathi Raju) రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సుమారు 1:00 గంట సమయం లో షాపులో మంటలు ఏర్పడి షాపులో ఉన్న పట్టు చీరలు ఫర్నిచర్ వివిధ రకాలైన క్లాత్ స్టోర్ అన్నీ మంటల్లో సుమారు 80 లక్షల(80 Lakhs) విలువగల బట్టలు అగ్నికి బూడిద అయిపోవడం జరిగినది.

ఈ మంటలు పై ఫ్లోర్ కు వ్యాపించడంతో ఇంట్లో నిద్రిస్తున్న బొప్పారాతి రాజు ఎటు వెళ్లాలో పాలు పోక ముందు ఇంటి ముందు ఉన్న రేకుల పైన దూకి ప్రాణాలు కాపాడుకోవడం జరిగినది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో తోటి వ్యాపారస్తులు నిలువ నీడ లేక కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డాడని తెలుసుకొని బట్టల వర్తకా సంఘం అధ్యక్షులు కూచన రవీందర్(Kuchana Ravinder) ఆధ్వర్యంలో వ్యాపారస్తులు తక్షణ సహాయం కింద ఒక లక్ష రూపాయలు(1 Lakh) ఆర్థిక సహాయం చేశారు. ఇంకా పలువురు నాయకులు వ్యాపార సంఘం ప్రతినిధులు రాజును ఓదార్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News