- ఆలయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
- ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు ముఖ్యనేతలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రం శ్రీశైలం దేవస్థానాన్ని తొలిసారిగా సందర్శించారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీ శైలంకు చేరుకున్నారు. ప్రధాని బృందం శ్రీశైలం చేరుకున్న వెంటనే వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు ఆలయ చరిత్ర, నిర్వహణ విధానం, శ్రీశైల పర్వత ప్రాంత అభివృద్ధి ప్రణాళికల గురించి ప్రధానికి వివరణ ఇచ్చారు. మోదీ ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడిపి, భక్తులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం ప్రధాని మోదీ శ్రీ బ్రహ్మారాంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. 12:40 కి తిరిగి భ్రమరాంబ అతిథి గృహానికి వస్తారు. మధ్యాహ్నం 1:20కి భ్రమరాంబ అతిథి గృహం నుంచి బయల్దేరి సుండిపెంట హెలిప్యాడ్ కు చేరుకుని కర్నూలు బైల్దేరుతారు. మధ్యాహ్నం 2.20కి కర్నూలు హెలిపాడ్ చేరుకుంటారు. 2.30 కి నన్నూరు సమీపంలోని రాగమయూరి వెంచర్ లో సభస్థలికి చేరుకోనున్నారు.
