Wednesday, March 4, 2026
Homeఆంధ్రప్రదేశ్TDP | పాలకొండ పార్టీ శ్రేణుల సమావేశం

TDP | పాలకొండ పార్టీ శ్రేణుల సమావేశం

పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District) భామిని(Bhamini)లో పాలకొండ నియోజకవర్గ(Palakonda Constituency) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన సమన్వయ సమావేశం(Coordination Meeting)లో ప్రధాన కార్యదర్శి(General Secretary), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ శాశ్వతమని చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడం వెనక కార్యకర్తల కష్టం దాగి ఉందని గుర్తుచేశారు.

చట్టబద్ధమైన పనుల కోసం కేడర్ వెళితే అధికారులు స్పందించాలని సూచించారు. పరకామణిలో రూ.50 కోట్ల డబ్బు దొంగిలిస్తే అది చిన్న దొంగతనమని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చెబుతుండటం సిగ్గు చేటని అన్నారు. జగన్ దేవుణ్ని పట్టించుకోరు.. ప్రజలను పట్టించుకోరని విమర్శించారు. మనందరి నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News