ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఇండస్ట్రీ గురించిన చర్చలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది.
అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సినీ ప్రముఖులు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు, జగన్ వారిని అవమానించారని అన్నారు. ఆరోజు సినీ ప్రముఖులను జగన్ కలవడానికి ఇష్టపడలేదని, చివరికి చిరంజీవి గట్టిగా అడిగాకే జగన్ కలిసారని చెప్పారు.
అయితే కామినేని చేసిన వ్యాఖ్యలను నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తప్పుబట్టారు. జగన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు అవమానం జరగడం నిజమేనని, అయితే చిరంజీవి నిలదీయ్యడం వల్ల జగన్ వారిని కలిసారనేది నిజం కాదని అని అన్నారు. ఆరోజు జగన్ ను కలవడానికి తనను పిలిచినా కానీ వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో తన పేరుని తొమ్మిదో స్థానం లో పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం పై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి కూడా ఫోన్ చేసి అభ్యంతరం వ్యక్తం చేసానని చెప్పారు.
మరిన్ని వార్తలు :