బడుగు వర్గాలపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఓవరాక్షన్
కలెక్టరేట్ ఎదుట ఉన్న హోటల్స్ కూల్చివేతకు ప్రయత్నం
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వచ్చిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది
పట్టణంలో అక్రమ భవనాలు ఎన్నో ఉన్నా పట్టించుకోని వైనం
బలహీన వర్గాల మహిళకు అండగా నిలిచిన బీసీ సంఘాలు
నల్గొండ కలెక్టరేట్ ఎదురుగా హోటల్స్ పెట్టుకొని బతుకుతున్న బడుగు వర్గాలపై మునిసిపల్ కమిషనర్(Municipal Commissioner) జులుం ప్రదర్శించారు. గత 15 సంవత్సరాలుగా హోటల్ పెట్టుకొని బతుకుతున్న జానకమ్మ అనే మహిళ హోటల్‌కి పర్మిషన్ లేదంటూ కూల్చివేసేందుకు మున్సిపల్ సిబ్బంది చేరుకున్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎలాంటి నోటీసులూ (Without Notice) ఇవ్వకుండా కూల్చేతకు ప్రయత్నించారు.

పోలీసులతో వచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. నల్గొండ పట్టణంలో సెల్లార్, అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ, అనుమతులులేని ఎన్నో భవనాలు (Illegal Constructions) ఉండగా వాటిని వదిలేసి బడుగు వర్గాలపై విరుచుకుపడటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం హోటల్ పెట్టుకొని జీవనం సాగించే బలహీన వర్గాల మహిళకు బీసీ సంఘాలు (BC Unions) అండగా నిలిచాయి.
