Wednesday, March 4, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంExtortion | శానిటేషన్ కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో మోసం..

Extortion | శానిటేషన్ కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో మోసం..

  • కార్మికుల నుండి ‘కోటి’ వసూలు…’వెట్టిచాకిరి’ చేయిస్తున్న కాంట్రాక్ట్ నిర్వహకులు!
  • ​70 మంది శానిటేషన్ ఉద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు..
  • రామాలయం సాక్షిగా లక్షయాభై వేలు వసూలు.!
  • పేదల సొమ్ముతో ప్లాట్ కొన్న సూపర్ వైజర్.!
  • ​బెదిరింపులకు అధికార పార్టీ నాయకుల పేర్లు.!

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో సాగుతున్న ఘరానా మోసం బట్టబయలైంది. శానిటేషన్ కాంట్రాక్టు దక్కించుకున్న ‘ఏ వన్ ఏజెన్సీ’ నిర్వాహకులు, వారి సూపర్వైజర్ల అరాచకాలు, బడుగు ఉద్యోగులను దోచుకున్న తీరు ‘మంత్రి’ కి తెలిసిందని దీంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారని.ఈ దందా వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో నాకు తెలియాలి అంటూ.. తన ముఖ్య అనుచరులకు బాధ్యత అప్పగించినట్లు ఆసుపత్రి వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు.

​లక్షల్లో వసూళ్లు.. దొరికినంతా దోపిడీ!

- Advertisement -

​నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాలలో మొత్తం 70 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించిన ఏ వన్ ఏజెన్సీ నిర్వాహకులు, సూపర్ వైజర్లు.. ఉద్యోగాల పేరు చెప్పి బరితెగించారు. A1ఏజెన్సీ లో పనిచేసే సూపరవైజర్ లే కార్మికుల మధ్య దాళారులుగా ఒక్కొక్క ఉద్యోగి నుంచి అక్షరాలా ‘లక్ష నుంచి లక్షన్నర రూపాయలు’ వసూలు చేశారనే ఆరోపణలు వెళ్లువేత్తుతున్నాయి. మొత్తం కలిపితే ఈ దోపిడీ ‘కోటి’ రూపాయలు దాటినట్లు విశ్వసనీయ సమాచారం. వసూలు చేసిన కోటి రూపాయలలో ప్రధాన సూపర్వైజర్లలో ఒకరు ఏకంగా పద్దేనిమిది లక్షల రూపాయలు పెట్టి ‘ప్లాట్‌’ కొనుగోలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News