Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌JubileeHills Ground Report | నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం

JubileeHills Ground Report | నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం

ఇప్పటివరకు వచ్చిన సర్వేల అంచనాలు తారుమారు కావొచ్చు!

రాజకీయ విశ్లేషకుడు అడారి నాగరాజు

- Advertisement -

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Bye Election)పై చేసిన అనేక సర్వే(Survey)లు తారుమారు కావొచ్చని రాజకీయ విశ్లేషకుడు (Political Analyst) అడారి నాగరాజు (Aadari Nagaraju) అన్నారు. అయితే.. తన విశ్లేషణ మాత్రం అలా అవదని, 10 సర్వేలతో సమానమని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీల, అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ఓటర్ నాడి, రాష్ట్ర, జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్నానని తెలిపారు. ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపు (Victory) వ్యక్తిగతంగా అతనికే కాకుండా కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కూడా అత్యవసరమని అభిప్రాయపడ్డారు. అందుకే దీన్ని ఒక ప్రధాన అంశంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. మైనార్టీలు (Minorities) ఈసారి రాష్ట్ర, జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటేస్తారని స్పష్టం చేశారు. తన విశ్లేషణకు తగ్గట్లు ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రిజల్ట్ తర్వాత ఏ అంశాలు ప్రభావితం చేశాయో వివరిస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News