కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ గ్రామానికి చెందిన ముస్కు శివ తీవ్రమైన అనారోగ్య కారణాలతో పురుగుల మందు తాగి ఆ@త్మహ*త్యకు ప్రయత్నించగా గురువారం మృతి చెందాడు మృతునికి 11 నెలల క్రితం వివాహం కాగా కొన్ని నెలల నుండి కడుపునొప్పితో బాధపడుచున్నాడు, ఎన్ని ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ కడుపునొప్పి తక్కువకు కాకపోవడంతో, తీవ్ర మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఈనెల 1వ తారీకున మొగ్ధంపూర్ గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆ@త్మహ*త్య ప్రయత్నం చేశాడు.
అతడిని అదే రోజున కరీంనగర్ లోనీ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు, పోస్టుమార్టం నిమిత్తం మృతుడిని కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు
