జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఓసీ మహిళకు రిజర్వ్
తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల(Elections) దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మేయర్లు(Mayors), చైర్‌పర్సన్ల(Chairpersons) రిజర్వేషన్లను ప్రభుత్వం శనివారం ఖరారు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) మేయర్ పదవిని ఓసీ మహిళకు రిజర్వ్ చేశారు. రాష్ట్రం మొత్తమ్మీద ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38, ఓపెన్ కేటగిరీకి 61 చైర్‌పర్సన్ స్థానాలను కేటాయించారు. ఇక, మేయర్ల విషయానికి వస్తే.. ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు ఒకటి, బీసీలకు మూడు, ఓపెన్ కేటగిరీకి 5 ఇచ్చారు. పూర్తి వివరాలను కింది జాబితాల్లో చూడొచ్చు.





