Tuesday, February 10, 2026
HomeతెలంగాణMunicipal Elections | మోగిన మునిసిపల్ నగారా.. 11న పోలింగ్..

Municipal Elections | మోగిన మునిసిపల్ నగారా.. 11న పోలింగ్..

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల(Municipal Elections) నగారా మోగింది. 7 మునిసిపల్ కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల(Schedule Release) చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(Code) అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 30తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 11న పోలింగ్(Polling) జరుగుతుంది. అవసరమైన చోట 12న రీపోలింగ్ పెడతారు. 13న ఓట్లు లెక్కిస్తారు. 16న మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. అదే రోజు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 53 లక్షల మంది ఓటు వేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News