Homeఆదాబ్ ప్రత్యేకంAllegations | కమిషనర్‌.. వీరారెడ్డి. షాడో కమిషనర్‌.. శివారెడ్డి

Allegations | కమిషనర్‌.. వీరారెడ్డి. షాడో కమిషనర్‌.. శివారెడ్డి

శివయ్యకు దక్షిణం చెల్లిస్తే చాలు ఏమైనా నిర్మించుకోవచ్చు...

కాసులు కొట్టు ఇల్లు కట్టు…
ప్రభుత్వ అనుమతి కావాలంటే రూ. 80 లక్షలు అవుతాయి..

- Advertisement -
  • నాకైతే రూ. 10 లక్షలు చాలు..
  • ఈ ఆఫర్‌ బాగుంది సార్‌ ఎవరిని కలిసి ఇవ్వాలని అడిగితే..
    అంతా మా అసిస్టెంట్‌ శివారెడ్డి చెప్తాడు.. అతనే చూసుకుంటాడు..
    అయన డిక్షనరీలో కరప్షన్‌ తప్ప యాక్షన్‌ ఉండదు..
  • గిట్లుంది పోచారం మున్సిపల్‌ కమిషనర్‌ వీరారెడ్డి వైట్‌ కాలర్‌ దందా…
WhatsApp Image 2025 06 03 at 16.45.56
పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి

అతనో మున్సిపల్‌ కమీషనర్‌… ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించాల్సిన బాధత్యగల హోదాలో ఉన్నాడు… కాని అయనకు ఇవనీ పట్టవు… జేబులో కాసులే నింపుకోవడమే లక్ష్యం.. అందుకోసం ఎంతకైన తెగిస్తారు.. తన చేతికి మట్టి అంటకుండా కాసులు దండుకునే నేర్పరి.. ఏదైన మాట్లాడితే చాలు అంతా మా శివయ్య చూసుకుంటాడు… అదేనండి మా శివారెడ్డి చూసుకుంటాడు… ఈ మున్సిపల్‌ కార్యాలయంలో శివారెడ్డి చెప్పిందే వేదం.. అయన దర్శనం కానిదే అనుమతి కాదు కదా.. ఒ కాగితం కూడా బయటకు రాదు… అయను దర్శనం చేసుకుంటే చాలు ప్రభుత్వ స్థలమైనా సరే… పార్కు స్థలమైనా సరే… మీరు ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్న సరే పనులు అటా జరిగిపోతాయంతే… ఇదంతా జరగాలంటే ముడుపులు దండిగా ముట్టజెప్పాల్సిందే… ఒ విధంగా పోచారం మున్సిపల్‌ కమీషనర్‌కు ఈ శివారెడ్డి షాడో కమీషనర్‌గా మారారని చెప్పడంలో ఏలాంటి సందేహం లేదు…

WhatsApp Image 2025 06 03 at 16.45.56 1
పోచారం మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ శివారెడ్డి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు 6అంతస్తుల భవనం కాటాలంటే.. అనుమతులు కావాలంటే సుమారు రూ.80లక్షల ఖర్చు అవుతుంది.. కాని పోచారంలో మాత్రం పరిస్థితి అందుకు బిన్నంగా ఉంటుంది… ఇక్కడ మున్సిపల్‌ కమీషనర్‌ మాత్రం ఇక్కడ అక్రమార్కులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నాడు… సుమారు రూ.80లక్షల ఖర్చు కావాల్సిన దగ్గర రూ.10లక్షలు ఇస్తే చాలు మీరు కట్టుకోవాలనంత కట్టుకోండి… ఏదైన ఉంటే మేము చూసుకుంటామని అభయం ఇస్తున్నాడు.. అసలే నగర శివారు ప్రాంతం కూడా కావడంతో ఉన్నతాధికారుల ఫోకస్‌ కూడా పెద్దగా లేకపోవడం ఈ కమీషనర్‌కు కాసుల వర్షం కురిపిస్తుంది… దీంతో ఒ అడుగు ముందుకు వేసి పార్కులను సైతం ఖబ్జా చేసే వారికి అండగా నిలుస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయం చారాణా ఇతగాడి జోబులోకి మాత్రం బారాణా.. ఇది ఇక్కడ జరుగుతున్న తంతు .. పోచారం మున్సిపల్‌ పరిధిలోని యన్నంపేట్‌ ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న భవనాలే ఇందుకు సాక్ష్యం.

WhatsApp Image 2025 06 03 at 16.45.16 1

ఇక్కడ జరుగుతున్న అక్రమాల్లో అదాబ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నది కేవలం పది శాతం మాత్రమే.. కానీ పోచారం మున్సిపల్‌ మొత్తం లెక్కబెడితే సుమారు 75 శాతం అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తాయి… షెడ్ల రూపంలో అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోనే నాథుడు లేడు… వీటిల్లో దేనికీ అనుమతులు ఉండవు.. వీళ్ళ ధైర్యం అంతా కూడా ఇక్కడి మున్సిపల్‌ కమీషనరే అనే విషయం కాదనలేని నిజం.. ఎలాంటి నిర్మాణం అయిన సరే కమిషనర్‌ని కలిసి మేనేజ్‌ చేసుకుంటే చాలు.. ఇక ఎలాంటి చీకు చింతా లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణం చేసుకోవచ్చు… ఎవరొచ్చినా అధికారులే మేనేజ్‌ చేసుకుంటారు అనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి…

WhatsApp Image 2025 06 03 at 16.45.16

శివారెడ్డి.. శివారెడ్డి.. శివారెడ్డి.. అసలు ఎవరు ఈ శివారెడ్డి..?
ఈ వ్యవహారం మొత్తంకు అసలు సూత్రదారి శివారెడ్డి అనే వ్యక్తి అంటూ బహిరంగ ప్రచారం జరుగుతుంది. అయితే తమ కార్యాలయంలో అసలు శివారెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగా… లేదా ప్రైవేటు ఉద్యోగా అనే విషయం తమకే తెలియదంటూ అక్కడ మున్సిపల్‌ అధికారులు చెవ్వులు కొరుకుంటున్నారు.. పోచారం మున్సిపల్‌ మొత్తంలో ఎక్కడ పార్క్‌ స్థలాలు కబ్జా చేయాలన్నా.. బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టాలన్నా మున్సిపల్‌ కమిషనర్‌ వీరారెడ్డి తర్వాత షాడో కమిషనర్‌ గా అవతారమెత్తిన వ్యక్తి శివారెడ్డిని ప్రసన్నం చేసుకుంటే చాలు… ప్రతి విషయంలో అయన ప్రెజన్స్‌ ఎంతో అవసరం.. అయన లేనిదే కాగితం కూడా కదలదు.. పోచారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఛాంబర్‌ లో కమిషనర్‌ చేయవలసిన పనులు మొత్తం కూడా ఇతగాడు చక్కబెడుతుంటాడు.. అక్రమ నిర్మాణాలు చేయాలంటే ఇతగాడిని దర్శనం చేసుకుని అతనికి చెల్లించాల్సిన ముడుపులు చెల్లిస్తే చాలు… మీరు చల్లగా మీ అక్రమ నిర్మాణాలు చేసుకోవచ్చు.. ఇలా అతని చేతికి వెళ్ళిన ముటలు అతను కమిషనర్‌ కు ముట్టజెప్తుంటాడు అనేది కొంతమంది భవన నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు.

WhatsApp Image 2025 06 03 at 16.45.17

ఇదిలా ఉంటే పోచారం మున్సిపల్‌ పరిధిలో సుమారు 200పార్కు స్థలాలు ఉంటే, అందులో సుమారు 150కి పైగా పార్కులు కబ్జాకు గురయ్యాయి.. కబ్జాకు గురైన పార్క్‌ స్థలాలను వెలికి తీయాల్సిన కమిషనర్‌.. అందుకు బిన్నంగా కొత్తగా పార్కులు డెవలప్మెంట్‌ చేసేందుకు రూ.200కోట్లు అవసరమంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్‌ పెట్టి అందరి దృష్టిని మళ్లించిన ఘనుడు ఇతగాడు.. కబ్జాకు గురైన పార్కుల వ్యవహారం ఎక్కడ తెరపైకి వస్తుందో..? అదే జరిగితే తనకు కష్టాలు ఎక్కడ వస్తాయో అని ముందే గ్రహించి ముందు జాగ్రత్తతో అధికారులను పక్కదారి పట్టించేందుకు డెవలప్మెంట్‌ పేరుతో పార్కుల ఊసే లేకుండా చేసేశాడు పోచారం మున్సిపల్‌ కమిషనర్‌ వీరారెడ్డి…

సెక్రెటేరియేట్‌ నుండి డిప్యూటేషన్‌ పై పోచారం మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటినుండి నేటి వరకు అయన డిక్షనరీలో కరప్షన్‌ తప్ప యాక్షన్‌ అనే పదం కనిపించడం లేదు.. ఇతగాడిపై ప్రతిరోజు అవినీతి, అక్రమాలు, భూకబ్జా వ్యవహారాలు నిత్యం ఏదో ఓ రూపంలో తెరపైకి వస్తూనే ఉన్నాయి.. అయినా ఉన్నతాధికారులు ఇతగాడి వ్యవహారంలో వెనకడుగు వేస్తున్నారు అంటే, సిడిఎంఏ కమీషనర్‌ నుండి మొదలుపెడితే తను పనిచేసే మున్సిపల్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ వరకు అందరినీ మేనేజ్‌ చేస్తున్నాడనేది స్పష్టంగా ఆర్థం అవుతుంది.. పోచారం మున్సిపల్‌ కమిషనర్‌ వీరారెడ్డి అతని అసిస్టెంట్‌ శివారెడ్డి అక్రమ నిర్మాణాదారుల వద్ద వసూలు చేసిన ఆధారాలు.. భూకబ్జా వ్యవహారంలో చైర్మన్‌, కౌన్సిలర్ల వద్ద సెటిల్మెంట్‌ చేసిన ఆడియోలు పూర్తి సాక్షాదారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకునిరానుంది ‘‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘‘…’’ మా అక్షరం అవినీతిపై అస్త్రం

- Advertisement -
RELATED ARTICLES

Latest News