Thursday, February 19, 2026
Homeవరంగల్‌Maoist | మావోయిస్టు అగ్రనేత ఆచూకీ కోసం…

Maoist | మావోయిస్టు అగ్రనేత ఆచూకీ కోసం…

  • రెండు జిల్లల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల ముమ్మర గాలింపులు
  • రెండు రోజులు గా నెలకొన్న యుద్ద వాతావరణం

మావోయిస్టు అగ్రనేత, రాష్ట్ర కమిటీ నాయకుడు బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ కోసం ములుగు, భూపాలపల్లి రెండు జిల్లాల పోలీసుల రెండు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున నుంచి కూంబింగ్ దాడులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ట్లు తెలుస్తోంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో వందలాది మంది పోలీసులు జల్లెడ పడుతునున్నారు. మేడారం అడవి ప్రాంతంలో బడే చొక్కారావు &దామోదర్ షెల్టర్ తీసుకున్నారన్న పక్క సమాచారంతో స్పెషల్ ఫోర్స్ తో కూంబింగ్ చేస్తూ నిరంతరం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇంటెలిజెన్స్ సమాచారంతో ములుగు, పస్రా,తాడ్వాయి, ప్రాంతాలలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.ముఖ్యంగా మావోయిస్టు పార్టీ అగ్రనేత బడే చొక్కా రావు, & దామోదర్ స్వస్థలం తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం కావడంతో పోలీసులు జాగిలాలను తోడ్కొని,భారీ బలగాల మోహరింపుతో ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. దీనితో రెండు జిల్లాలోని ఆయా అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొంది.

- Advertisement -

చతిస్గడ్ రాష్ట్రం నుండి మావోయిస్టులను తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా రాత్రిపగలు ప్రత్యేక పోలీసు దళాలు నిరంతరం పహార కాస్తున్నట్లు వినికిడి. ప్రధాన రహదారులపై చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి వచ్చి పోయే పలు వాహనాల ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.అనుమానితు లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు, మరికొందరు కొత్త వ్యక్తుల ను ప్రశ్నించి వదిలిపెడు తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News