Wednesday, March 4, 2026
HomeసినిమాProducer Balaji | నా స్థాయిని పెంచే మూవీ ‘మఫ్టీ పోలీస్’

Producer Balaji | నా స్థాయిని పెంచే మూవీ ‘మఫ్టీ పోలీస్’

యాక్షన్ కింగ్ (Action King) అర్జున్ (Arjun) సర్జ, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా (Police Investigative Personal Drama) “తీయవర్ కులై నడుంగ”. తెలుగులో “మఫ్టీ పోలీస్”(Mufti Police)గా ఈ నెల 21న (నేడు) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జీఎస్‌ఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై జి.అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో “మఫ్టీ పోలీస్” పేరుతో ప్రముఖ నిర్మాత ఏఎన్ బాలాజీ (A.N.Balaji) శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.

డిస్ట్రిబ్యూటర్‌గా 400 పైచిలుకు చిత్రాలు

డిస్ట్రిబ్యూటర్‌గా 400 పైచిలుకు చిత్రాలు పంపిణీ చేసి, నిర్మాతగా “రంగం-2, యుద్ధభూమి, ఒరేయ్ బామ్మర్ది, డాక్టర్ 56, మై డియర్ భూతం వంటి చిత్రాలను అందించిన బాలాజీ.. “మఫ్టీ పోలీస్” చిత్రం నిర్మాతగా తన స్థాయిని మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. రచయిత హత్య నేపథ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందని బాలాజీ పేర్కొన్నారు. ఇటీవలికాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించామని చెప్పారు. ఆ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంచేయడం ఈ చిత్రం ప్రత్యేకతని తెలిపారు.

- Advertisement -

‘భాగ్యం’ క్రేజ్‌

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్(అలియాస్ భాగ్యం)కు తెలుగులో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక థియేటర్లలో “మఫ్టీ పోలీస్”ను విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు పర్సనల్ డ్రామా కూడా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం కల్పించిన జి.అరుల్ కుమార్‌కి, చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News