Thursday, March 5, 2026
Homeహైదరాబాద్‌MSF | మాదిగ ఉద్యోగుల పేరుతో రేవంత్ రెడ్డికి సన్మానం సిగ్గుచేటు

MSF | మాదిగ ఉద్యోగుల పేరుతో రేవంత్ రెడ్డికి సన్మానం సిగ్గుచేటు

  • ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ పోరాటమే ఎస్సీ వర్గీకరణ ఫలితం
  • గ్రూప్ నియామకాలలో వర్గీకరణ అమలు చేయకుండానే ఫలితాలు
  • మాదిగలకు అన్యాయం ఎంఎస్ఎఫ్ ఆవేదన
  • ఓయూ ప్రొఫెసర్ కాశీంపై విమర్శలు

మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు-ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ

మాదిగ ఉద్యోగుల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నిర్వహించాలనుకుంటున్న సన్మాన కార్యక్రమానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకీ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ఉద్యమానికీ ఎలాంటి సంబంధం లేదని ఎంఎస్ఎఫ్ నాయకులు స్పష్టం చేశారు.బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ప్రకటన చేశారు.ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ మాట్లాడుతూ…

- Advertisement -

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏ పాలకుని దయాదాక్షిణ్యాలతో రాలేదని, అది మంద కృష్ణ మాదిగ నాయకత్వంలోని సుదీర్ఘ పోరాట ఫలితమని పేర్కొన్నారు.అనేక మంది మాదిగ యువత త్యాగాలు,జైలు జీవితం,లాఠీ దెబ్బలు భరించి సాధించుకున్న హక్కును రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోవడం సరికాదన్నారు.వర్గీకరణ పేరుతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడం కొందరి స్వార్థపూరిత ఆలోచన మాత్రమేనని,ఆ కార్యక్రమానికి మాదిగ దండోరా ఉద్యమం లేదా మాదిగ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ప్రొఫెసర్ కాశీం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం దురుద్దేశపూరితమని ఆరోపించారు.ఇటీవల డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే ఫలితాలు విడుదల చేయడం వల్ల వేలాది మంది మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.జనాభా ప్రాతిపదికన రావలసిన వాటా పూర్తిగా అమలు కాలేదని ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి డాక్టర్ పల్లెర్ల సుధాకర్ మాదిగ,జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ,రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివకుమార్ మాదిగ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జనపాల మహేష్ మాదిగ,రాష్ట్ర నాయకులు ఎడవెల్లి అజయ్ మాదిగ,ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు దావు ఆదిత్య మాదిగ,హరి ప్రసాద్ మాదిగ,నంబి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News