తెలంగాణ రాష్ట్రంలో జూట్ (జనప నార) పంట సాగు(Jute Crop Cultivation)ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భువనగిరి ఎంపీ(Bhongir MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Jute Corporation of India) అధికారులు కూడా తెలంగాణ రైతులకు జూట్ పంటపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు హైదరాబాద్ వచ్చి.. జూట్ ప్రొడక్షన్ అంశంపై ఎంపీతో చర్చలు జరిపారు. జూట్ పంటను సాగు చేయటం వల్ల భూమికి, పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. జూట్ సాగు ద్వారా ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. పార్లమెంట్ టెక్‌స్టైల్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడి(Member of the Parliament’s Standing Committee on Textiles)గా ఎంపీ చామల.. జూట్ ఉత్పత్తిపై లోక్‌సభ(LokSabha)లో ప్రశ్నించిన నేపథ్యంలో జూట్ అధికారులు హైదరాబాద్ వచ్చారు.
MP Chamala | జనప నార సాగును ప్రోత్సహించాలి
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
