- చైర్మన్ గా గడ్డం స్వప్న,వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న
- ప్రమాణం చేయించిన ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్
మోత్కూరు పురపాలక సంఘం ఎన్నికలు ఫిబ్రవరి 13 న ముగిశాయి.సోమవారం ప్రమాణ స్వీకారానికి కౌన్సిలర్ల గా 12 మంది గెలుపొందిన అభ్యర్థులు కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ 1పురపాలక సంఘం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం సమావేశంలో పాల్గొన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్ కౌన్సిలర్ ల తో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం మోత్కూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా గడ్డం స్వప్న ను పన్నాల శ్రీ విధ్య ప్రాతిపదించిగ,గనగాని శైలజా బలపరిచారు.వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న ను కారు పోతుల వెంకన్న ప్రాతిపదించగా,బీసు శ్రీకాంత్ బలపరిచారు.బరిలో ఎవరు లేకపోవడంతో చైర్మన్,వైస్ చైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- Advertisement -
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కే.సతీష్ కుమార్ పాల్గొన్నారు.
- Advertisement -
