Monday, March 16, 2026
Homeఆదిలాబాద్Morning Walk | మార్నింగ్ వాక్ దీర్ఘకాలిక వ్యాదులనుండి రక్షణ కలిగిస్తుంది..

Morning Walk | మార్నింగ్ వాక్ దీర్ఘకాలిక వ్యాదులనుండి రక్షణ కలిగిస్తుంది..

  • మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. .

మార్నింగ్ వాక్ దీర్ఘకాలిక వాదులనుండి రక్షణ కలిగిస్తుంద మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని డిగ్రీకళాశాలలో వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు వారితో కలిసి మార్కింగ్ వాక్ లో పాల్గొన్నారు. వైస్ చైర్మన్ గా ఎన్నికై మొదటి సారి రావడంతో గణేష్ చక్రవర్తిని శాలువాతో సత్కరించి ఆహ్వానించారు. ఈ సందర్బంగా గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ మార్నిగ్ వాక్ వల్ల బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుందని, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుందని మానసిక స్థితి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందన్నారు.

మార్కింగ్ వాక్ నిర్వకులకు కావలసిన అవసరాలపై అసోసియేషన్ సభ్యులు విన్నవించడంతో. అతి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాలం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ భీమ సురేందర్, వైస్ ప్రెసిడెంట్ సనుగుల దేవిదాస్, జాయింట్ సెక్రటరీ అనగందుల రాజు, క్యాషియర్ శంకర్ గౌడ్, ఫౌండర్ ప్రెసిడెంట్ పి. దేవేందర్ రెడ్డి ఈ,సి మెంబెర్స్, మునిందర్ రెడ్డి, పోడెల్లి బాపు, కిష్ట రెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News