వేసవి రానున్న దృష్ట్యా కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్(Karimnagar Municipal Corporation) పరిధిలో ప్రజల తాగునీటి(Water Supply) అవసరాలు తీర్చేందుకు అదనపు వాహనాలను (Additional Vehicles) అందుబాటులోకి తెచ్చారు. చెత్త సేకరణ(Garbage Collection) అవసరాలకు తగిన విధంగా మరికొన్ని వాహనాలను మునిసిపల్ కార్పొరేషన్ వినియోగంలోకి తెచ్చింది. కోర్టు చౌరస్తా వద్ద గల వాటర్ ట్యాంక్ ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy), మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి హాజరయ్యారు. 35 ట్రాక్టర్లు, 25 ట్రాలీలు, 10 స్వచ్ఛ ఆటోలు, 10 వాటర్ ట్యాంకర్లను వినియోగంలోకి తెచ్చారు. మునిసిపల్ ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజయ్ కుమార్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ బీమ్ వర్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్, ఎంహెచ్ఓ సుమన్ తదితరులు కూడా పాల్గొన్నారు.
Municipal Vehicles | వాడకంలోకి మరిన్ని మునిసిపల్ వాహనాలు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
