Tuesday, February 17, 2026
Homeస్పోర్ట్స్Cricket | చెలరేగిన మహ్మద్ షమీ..

Cricket | చెలరేగిన మహ్మద్ షమీ..

  • పెవిలియన్ కు క్యూ కట్టిన జమ్మూ కాశ్మీర్ బ్యాటర్లు..

రంజీ ట్రోఫీ 2026 సెమీఫైనల్ మ్యాచ్లో భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. జమ్మూకాశ్మీర్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో షమీ రెచ్చిపోయాడు. ఒక ఇన్నింగ్స్ లో 8 వికెట్లను పడకొట్టి తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో షమీ ధాటికి జమ్మూకాశ్మీర్ బ్యాటర్లు క్యూ కట్టారు. అతని బౌలింగ్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు జమ్మూకాశ్మీర్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ బెంగాల్కు 26 పరుగుల ఆధిక్యం లభించింది.

షమీ ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 22.1 ఓవర్లు బౌలింగ్ చేసి 90 పరుగులు ఇచ్చి 8 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇది అతని ఫస్ట్-క్లాస్ కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. మ్యాచ్లో అతని ప్రదర్శనతో బెంగాల్ ఆధిక్యంలో నిలిచింది. గత కొంతకాలంగా గాయాల కారణంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమీ.. ఈ ప్రదర్శనతో మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతని ఫామ్ కొనసాగితే టీమిండియాలో తిరిగి చోటు సంపాదించే అవకాశాలు పెరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News