Tuesday, February 17, 2026
Homeఆరోగ్యంAwareness | ఫోన్ ఎక్కువుగా చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

Awareness | ఫోన్ ఎక్కువుగా చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

  • మీ జీవిత గమనమే మారిపోతుందట..
  • పెద్దల మాట చద్దన్నం మూట..
  • నిపుణుల మాటలు ఆలకించండి..

ఉద‌యం లేచిన త‌రువాత నేల మీద కాలు పెట్ట‌క ముందు నుండి రాత్రి నిద్ర‌పోయే వ‌ర‌కు మ‌నం ఫోన్ ల‌ను చూస్తూనే ఉంటాం. ఈ విధంగా నిత్యం ఫోన్ ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల నిద్ర‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంతో పాటు శారీర‌క, మాన‌సిక ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి ప‌డుకునే ముందు ఫోన్ చూడ‌డాన్ని మానేయాలని వారు హెచ్చ‌రిస్తున్నారు.

రాత్రి ప‌డుకునే ముందు ఫోన్ ను చూడ‌డం వ‌ల్ల నిద్ర‌కు ఆటంకం క‌ల‌గ‌డంతో పాటు అనేక స‌మ‌స్య‌ల‌ను మ‌నం ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. నిద్రించే ముందు ఫోన్ ను చూడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఏవిధ‌మైన న‌ష్టం క‌లుగుతుందో.. ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

ఫోన్ నీలికాంతిని విడుద‌ల చేస్తుంది. ఇది మెద‌డుకు నిద్రించే స‌మయం ఆస‌న్న‌మైంద‌ని తెలియ‌జేసే మెల‌టోనిన్ అనే హార్మోన్ ఉత్ప‌త్తిని అణ‌చివేస్తుంది. దీని వ‌ల్ల నిద్ర ఆల‌స్యం అవుతుంది. శ‌రీరానికి విశ్రాంతి త‌గ్గుతుంది. నిద్రించే ముందు ఫోన్ చూడ‌డం వ‌ల్ల నిద్ర నాణ్య‌త త‌గ్గ‌డంతో నాటు నిద్రించే స‌మ‌యం కూడా త‌గ్గుతుంది.

కొంద‌రు రాత్రి స‌మ‌యంలో కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. ఇలా రాత్రి స‌మ‌యంలో ఎక్కువ‌గా ఫోన్ మాట్లాడే వారు త‌క్కువ స‌మ‌యం నిద్రించ‌డంతో పాటు త‌ర‌చూగా మేల్కొంటారు. ఇలా త‌ర‌చుగా మేల్కోవ‌డం వ‌ల్ల గాఢ నిద్ర వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు త‌గ్గుతాయి. రాత్రిపూట ఫోన్ వాడ‌కం నిద్ర నాణ్య‌త‌ను త‌గ్గిస్తుంది. త‌గినంత స‌మ‌యం నిద్రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

ఫోన్ వాడ‌కం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. నిద్రలేమి కార‌ణంగా శ‌రీర జీవ‌క్రియలు మంద‌గించ‌డంతో పాటు శ‌క్తి వినియోగించే హార్మోన్లు కూడా ప్ర‌భావితం అవుతాయి. దీంతో శ‌రీర బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుందని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News